Silk Smitha - Oka Abhaagyuraalu
సిల్క్ స్మిత అంటే చిన్న పిల్లాడి నుండి పండు ముదుసలి వరకు తెలియని వారుండరు. అసలు పేరు విజయలక్ష్మి, పుట్టింది ఏలూరులో (2 Dec 1960). తన తల్లి నరసమ్మతో కలిసి 1978 లో మద్రాసులో ఆగుపెట్టిన విజయలక్ష్మి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టింది, మొదట మేకప్ అమ్మాయి గా చేరి జూనియర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో కనిపించింది. ప్రాముఖ్యం ఉన్న పాత్రలో నటించిన తొలి చిత్రం వందిచక్రం (తమిళం-1979) లో సిల్క్ అనే పాత్రలో నటించటంతో అదే పేరున సిల్క్ స్మిత గా పిలువబడింది. అదే సినిమా ఘరానా గంగులు పేరుతో తెలుగులో తీయబడితే ఆ పాత్రను తెలుగులో కూడా తనే పోషించి తెలుగు వారికీ పరిచయమయింది. బొద్దుగా ఉండడం, ముద్దు ముద్దుగా మాట్లాడడం, మత్తు కళ్ళు అందరినీ మైమరపించేశాయి. అతి తక్కువ కాలంలోనే తారాపథానికెదిగిపోయింది, హీరోయిన్ పాత్రల్ని పోషించటమే కాక నిర్మాతగానూ మారిపోయింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 500 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది.
ఆమె నిజజీవితం - చిత్రజీవితం నాణానికి రెండు వైపులా విభిన్నంగా ఉండే బొమ్మ - బొరుసు లాంటిది. చిత్రాల్లో వాంప్ పాత్రలు వేసినా నిజజీవితంలో ప్రేమకై తపించి ప్రేమకై మరణించిన ప్రేమమయి. కేవలం డాన్సు పాత్రల్లోనే కాక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మెప్పించిన నటి స్మిత. కథానాయికగా పలు చిత్రాల్లో నటించటమే గాక తనే నాయికగా తన మాతృభాష తెలుగులో చిత్రాన్నినిర్మించింది. షూటింగ్ సమయాల్లో అందరితో సరదాగా ఉండే మంచి మనిషి, ముసలి వాళ్ళను కూడా ఏ బాబూ అంటూ సౌమ్యంగా పలకరించిన మనిషి. ఎవ్వరి మనసును నొప్పించక, ఎవ్వరితోనూ గొడవ పడక మనుగడ సాగించిన సౌమ్యస్తురాలు.
తెలుగు నాట పుట్టి తమిళంతో చిత్ర రంగ ప్రవేశం చేసి అక్కడ గుర్తింపు తెచ్చుకుని తరువాత తెలుగులోనే కాక, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో నటించింది. మొదట్లో పనికి రావు పొమ్మన్ననిర్మాతలే ఆమె కాల్శీట్లకై పడిగాపులు గాచారు. ఒక టైం లో ఆమె సినిమాలు కనక వర్షం కురిపించాయి, ఆమె తమ చిత్రంలో కనబడితే చాలు అనుకున్నారు నిర్మాతలు. అగ్ర హీరో అయిన సూపర్ స్టార్ NTR నాదేశం చిత్రం పబ్లిసిటీ పోస్టర్ పైనే ప్రత్యేకంగా ఆమెని వేశారంటే ఆమెకున్న క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు.
శృంగార పాత్రలు వందలు పోషించినా నటిగా ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు - వసంత కోకిల, పులిదెబ్బ, అభిమన్యుడు, పారిపోయిన ఖైదీలు, విషకన్య, మాయలాడి, స్వాతంత్ర్యానికి ఊపిరి పోయండి, వీర విహారం లాంటివి కలవు. పల్నాటి పౌరుషం చిత్రం లోని పాత్ర ఎంతో సానుభూతిని పొందటమే కాక అందులోని "బావలు సయ్యా" పాట ఆల్ టైం హిట్ గా నిలిచిపోయింది.
సాఫీగా సాగిపోతున్న స్మిత జీవితంలోకి ప్రేమద్రోహి ప్రవేశించటం-మోసగించటం, చిత్ర నిర్మాణాన్ని చేబట్టి ఆర్థికంగా నష్టపోవటం, ఆదుకునే వారే కనిపించకపోవటం, దరికిచేరే దారి దారిలో కానరాకపోవటం. కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు కనిపించినప్పుడు చుట్టూ చేరిన వాళ్ళు - అప్పుల కుప్పలు కనిపించగానే కనిపించకుండా పోవడం ఆమెని మానసిక క్రుంగ దీశాయి. ఇంకా జీవించటం వృధా అనుకున్న ఆమె 23 సెప్టెంబర్ 1993 న ఉదయం 9 గంటల ప్రాతంలో మద్రాసులో తాను ఉండే అపార్టుమెంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని తనువు చాలించింది. ప్రేమకరువై మరో తార నేల రాలింది.
ప్రస్తుతం సిల్క్ స్మిత జీవిత గాథకు హిందీలో The Dirty Picture గా తెరరూపం లభించడంతో ఆమె జీవితం కొత్త తరానికీ తెలిసే అవకాశం కలిగింది. కానీ సినిమా టైటిల్ లోనే అసభ్యత వినిపిస్తుండటంతో అసలు సినిమాలో ఆమె కథను ఉన్నది ఉన్నట్టు చూపిస్తారా! లేక చనిపోయాక కూడా ఆమెపై వ్యాపారం చేస్తారా! అన్న సందేహం కలుగుతుంది. సిల్క్ స్మితగా అగ్ర హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తుండటంతో అంత అద్వాన్నంగా తీయరేమో అనీ సమాధాన పరుస్తుంది. ఏమైనా మన తెలుగు అమ్మాయి భారత దేశమంతటా గుర్తింపు పొందటం విశేషమే. ఆ చిత్రం ఎలా చూపించినా అభిమానుల గుండెల్లో ఆమె స్థానం పదికాలాల పాటు పదిలంగానే ఉంటుంది.

| Silk Smitha in Naadesham (1982) |
![]() |
| Smitha Last Photo |
![]() |
| Smitha Last Letter |

0 comments:
Post a Comment