Monday, October 3, 2011

Sankarabharanam Songs -7


శంకరాభరణం చిత్రంలోని పాటలు 


Song : Music Lesson  

ఈ సన్నివేశాన్ని అప్పట్లో రికార్డుల్లో పెట్టారు, నా చిన్నప్పుడు చాలా చోట్ల వినిపించేది, తరువాత వచ్చిన కాసెట్స్ లో కనిపించలేదు.  తమాషా గానే కాదు, నేడు నూతన సంగీతం పేరుతో శాస్త్రీయ సంగీతాన్ని ముక్కలు చేసే ప్రభుద్దులకు ఇది ఒక చెంప పెట్టులా ఉంటుంది ఈ సన్నివేశం, అందుకే ఇక్కడ పెడుతున్నాను.

=======================================================================
పాట : 7 (సంగీతం పాఠాలు) 
గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం 
సంగీతం : కే.వి. మహదేవన్
రాగం: ---
రచన: జంధ్యాల 
నటీ నటులు: ఏడిద శ్రీరాం ప్రసాద్, జే.వి. సోమయాజులు
=======================================================================
ఒక ఇంటి అరుగుపైన ఒక అమ్మాయికి సంగీతంలో ఓనమాలు తెలియని ఒక సంగీతం మాస్టారు సంగీతం పాఠాలు చెబుతుంటాడు.....



మాస్టారు: రాశావా?
అమ్మాయి: రాశానండి.
మాస్టారు: ఇప్పుడు బ్రోచేవారెవరురా అన్న పల్లవి మళ్ళీ వస్తుందన్న మాట. అదీ.... మీ ఇంట్లో రికార్డులూ అవీ చాలా ఉన్నాయి కదూ? 
అమ్మాయి: ఉన్నాయండి
మాస్టారు: ఈ కీర్తన ఎప్పుడైనా విన్నావా? 
అమ్మాయి: విన్నాను మాష్టారూ .
మాస్టారు: ఎలా విన్నావో పాడు?
అమ్మాయి: బ్రోచేవారెవరురా - నినువినా రఘువరా ! 
(అని శ్రావ్యంగా పాడితే మాష్టారు కి కోపం వచ్చింది)


మాస్టారు: ఆపేయ్... ఆపేయ్.. అదే మీకూ నాకూ ఉన్న వ్యత్స్యాసం, పూర్వం ఎప్పుడో పడవల్లో పోయేప్పుడు పాడిన పాట, కట్టిన రాగమూను అది. ఇప్పుడు... బస్సులు, రైళ్ళు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు అన్నీ వచ్చేశాయా! స్పీడు... లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడు వచ్చిందో, అలాగే సంగీతంలో కూడా రావాలి...  


అమ్మాయి: ఊ 


(అమ్మాయి అలా ఊ కొడుతుంటే మష్ట్టారు ఇంకా గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించాడు


మాస్టారు: ఈ విషయంలో నేను చాలా చాలా ప్రయోగాలు చేశాను, కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను. నిజానికి నా లాంటి మేధావి దగ్గర నువ్వు సంగీతం నేర్చుకోడం అన్నది నీ అదృష్టమే అనుకో ! ఇంతకన్నా ఈ విషయంలో నేనేం చెప్పలేను. ఈ పాట అసలు ఎలా పాడాలంటే...
అమ్మాయి: ఎలా పాడాలండీ?

మాస్టారు: 
బ్రోచేవా రెవరురా
నినువినా.... టటటటా.... రఘువరా.....టటటటా....
నను బ్రోచేవా రెవరురా....
ఓ చతురా... ననా... దివందిత నీకు పరాకేల నయ్యా!



(ఇంతలో స్నానం చేసి తిరిగి వస్తున్న శాస్త్రి, శంకరం లు అక్కడ వస్తారు. "దాసూ" అంటూ  శాస్త్రి కోపంతో అరచిన అరపుకి పక్కకు చూసిన మాస్టారు "ఆ...  శంకరాభరణం గారా! రండి రండి... ముఖ్యంగా మీ లాంటి ఛాందసులు, నా లాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా విని తీరాలి" అంటాడు.

శాస్త్రి అసహనంతో "అక్షరాల్న్తి నీ ఇష్ట మోచ్చినట్టు విరిచేసి, భావాన్ని నాశనం చెయ్యడమే నటయ్యా నీ ప్రయోగం? దాసూ.. ఆకలేసిన బాబు అమ్మ అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలా అంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం వుంది, శ్రుతి వుంది, స్వరం వుంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండివుంది దాసూ... తాదాత్మ్యం చెందిన ఒక మహా మనిషి గుండె లోతుల్లోంచి గంగా జలంలా పెల్లుబికిన గీతమది, రాగామది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృత తుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చెయ్యకయ్యా! మన జాతి గర్వించ దగ్గ ఉత్తమోత్తమమైన  సంగీతాన్ని అపభ్రంశం  చెయ్యకు" అని, శంకరం తో కలిసి వెళ్ళిపోతాడు శాస్త్రి)






0 comments:

Post a Comment