Saturday, October 1, 2011

Sankarabharanam Songs -4


శంకరాభరణం చిత్రంలోని పాటలు 

Song : Shankara Naadashareeraaparaa

తననే నమ్ముకు వచ్చిన తులసిని బెంగుళూరు కచ్చేరి నుండి తనతో బాటే ఇంటికి తీసుకువేలతాడు శాస్త్రి. ఒకనాడు ఊళ్ళో శారదా విద్యాలయం అనే సంగీత పాటశాల ప్రారంభానికి  తనతో బాటు తీసుకెళతాడు శాస్త్రి. తులసి జాడ తెలుసుకున్న రత్నపాప అక్కడకు వచ్చి పదిమందిలో శాస్త్రి ని నా అమ్మాయిని లేపుకు వచ్చాడు అని దూషించి తనతో బాటు బలవంతంగా తీసుకెళుతుంది తులసిని. శాస్త్రి అవమానంతో ప్రారంభం చేయకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతాడు. తరువాత తులసి శాస్త్రి గారి రికార్డులు వింటూ పాడుతూ కాలం గడుపుతుంది, ఒకరోజు పిల్ల జమిందారు వచ్చి తులసిని బలవంతం చేస్తాడు, నిస్సహాయురాలై మౌనంగా రోదిస్తుంది, కాని శాస్త్రి చిత్ర పటాన్ని కాలితో తన్ని దుర్భాషలాడటం సహించలేక తులసి శాస్త్రి ఫోటో గాజు ముక్క తోనే పిల్ల జమిందారును పొడిచి చంపేస్తుంది. అదే రక్తపు చేతులతో అదే రాత్రి శాస్త్రి ఇంటికి వెళ్ళిన తులసి ఆ రక్తంతో కాళ్ళను అభిషేకించి కన్నీరు కారుస్తుంది. అంతా గ్రహించిన శాస్త్రి తన స్నేహితుడు లాయర్ మాధవాచారి ఇంటికి వెళ్లి ఎంత ఖర్చైనా తులసి కి శిక్ష పడొద్దు అని చెబుతాడు, తులసి చేసింది ఏ నేరమూ కాదని, ఇది తల్లి రత్నపాప వాళ్ళ జరిగిన పొరబాటుగా ఆమెకే శిక్ష విధించి తులసి ని నిర్దోషిగా విడుదల చేస్తుంది కోర్టు. ఇంటికి తీసుకెళతాడు తన జట్కాలో శాస్త్రి. అది చూసిన నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. ఎన్నడు కన్నెత్తి కూడా చూడని వంటమనిషి కూడా ఇలాంటి  అంటూ సొంటు లేని ఇంట్లో తాను ఉండలేనంటూ వెళ్ళిపోతుంది. మడి ఆచారాలు అనేవి మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదియ్యడానికి కాదు తులసి అంటూ మడి నీళ్ళు వంట తులసి చేతనే చేయిస్తాడు శాస్త్రి. శాస్త్రి అభ్యుదయ భావాలకు తులసి ఎంతో పొంగిపోయి శాస్త్రి గొప్ప సంగీత విద్వాంసుడే కాదు గొప్ప మానవతా వాది అని మరింత అభిమానాన్ని పెంచుకుంటుంది.

ఆ రోజు గుళ్ళో బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలందరూ త్యాగరాజ ఆరాధనోత్సవాల మొదటి కచేరీకి ప్రతి ఏడు లానే శాస్త్రి ని ఆహ్వానిస్తారు. తులసి ని వెంటబెట్టుకు వెళ్ళిన శాస్త్రి పూజానంతరం తన కచేరిని మొదలు పెడతాడు. శాస్త్రి ఆజ్ఞతో వేదికపైన వచ్చి వీణను చేత పట్టతంతోనే మృదంగం వాయించే గోపాలం తో సహా వేదికపైన అందరూ దిగి వెళ్ళిపోతారు, వెంటనే వచ్చిన వారంతా వెళ్ళిపోతారు, ఇది చూసి నేశ్చేష్టురాలైన తులసి తన వల్లే శాస్త్రికి ఇంత అవమానం జరిగిందని అక్కడనుండి ఇంటికి వెళ్లి తన పెట్టె సర్దుకుని ఊరు వదిలి వెళ్ళిపోతుంది. అవమాన భారంతో శాస్త్రి ఆవేశంగా తన ఆరాధ్య దైవమైన శివున్ని శంకరా.... అంటూ దిక్కులు పెక్కటిల్లేలా పాడుతూ తనకు సమాధానం చెప్పాల్సిందే నని తాను చేసిన తప్పేంటని తలచి శివున్ని ప్రార్థిస్తాడు. శివుడు ఆవేశంలో ఉన్న శాస్త్రి పైన వర్షంగా గంగను కురిపించి శాంతింపజేస్తాడు.  తాను లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడనని శివుడు తనను  సమర్థిస్తున్నాడని తులసికి తనకు ఉన్న సంబంధం ఆ సర్వేశ్వరుడికే తెలుసునని  ఎవ్వరు ఏమనుకున్నా పరవాలేదు అని భావిస్తాడు శాస్త్రి.  



త్యాగరాజ ఆరాధనోత్సవాలలో భాగంగా ఆరాధ్య దైవం ఆరాధనలో శాస్త్రి 

=======================================================================
పాట : 4 (శంకరా నాదశరీరాపరా) 
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : కే.వి. మహదేవన్
రచన: వేటూరి సుందరరామ మూర్తి
రాగం : మధ్యమావతి
నటీ నటులు: జే.వి.సోమయాజులు 
=======================================================================

శంకరా..... నాద శరీరాపరా 
వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా..... నాద శరీరాపరా 
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా......

ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గాణమనీ 
మౌన విచక్షణ గాణ విలక్షణ రాగమె యోగమనీ 

ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గాణమనీ 
మౌన విచక్షణ గాణ విలక్షణ రాగమె యోగమనీ 

నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే 
నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే 
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత ఖందరా నీల కంధరా
క్షుద్రులెరుగ నీ రుద్రవీణ నిర్ణిద్ర గానమిది
అవథరించారా విని తరించరా...

శంకరా..... నాద శరీరాపరా 
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా....

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు 
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు 
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు

పరవశాన శిరసూగంగా ధరకు జారేనా శివగంగా 
పరవశాన శిరసూగంగా ధరకు జారేనా శివగంగా 
నా గాణలహరి నువు మునుగంగా ఆనంద వృష్టి నే తడవంగా.....

శంకరా..... నాద శరీరాపరా 
వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా....... శంకరా.........




జరిగిన పరాభవానికి ఆవేశంతో శివున్ని వీరావేశంతో వేడుకుంటున్న శాస్త్రి 

అభ్యుదయ భావాలతో తులసికి సంగీతంలో స్థానం కల్పించటం తప్పా అని
 పరమశివుణ్ణి ప్రశ్నిస్తున్న శాస్త్రి 


తన ప్రశ్నలకు సమాధానంగా, తాను చేసింది  తప్పుకాదని
గంగను కురిపించి  తన ఆవేశాన్ని చల్లబరిచిన శంకరునికి
నమస్కారాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్న శాస్త్రి 







0 comments:

Post a Comment