శంకరాభరణం చిత్రంలోని పాటలు
Song : Dorakuna Ituvantiseva
తులసి శాస్త్రి గారిని ఆర్థికంగా ఆదుకోవాలని అనుకుంటుంది. తన తల్లి తన పేర రాసిపోయిన ఆస్తి కాగితాలు అందజేస్తూ వద్దంటే, ఏ ధర్మకార్యానికైనా ఉపయోగించు అని సలహా ఇస్తాడు మాధవా చారి తులసికి. శాస్త్రి అప్పటికే తన ఇల్లు షావుకారు దగ్గర తనఖా పెట్టి అవసరమైనపుడు డబ్బు తెచ్చుకుంటూ ఉంటాడు, ఒకసారి శాస్త్రి షావుకారు ను డబ్బు అడుగుతున్నపుడు పక్కనే వున్నతులసి వారి మాటలు వింటుంది. ఇప్పటికే ఇంటి విలువకు మించే ఇచ్చాను ఇవ్వలేనని అంటూనే ఎంత అవసర మోస్తేగాని అడగరు తమరు అంటూ కొంత డబ్బు ఇస్తాడు. ఎలా బ్రతికిన మనిషి కళకు ఆదరణ లేక ఎలా అయిపోయాడు అనుకుంటుంది తులసి. శాస్త్రి గారు షావుకారు దెగ్గర తీసుకున్న అయిదు వేలు ఇచ్చివేసి ఇంకా మళ్ళీ శాస్త్రి గారు డబ్బు ఎప్పుడడిగినా ఇవ్వండి, నేను తీర్చేస్తాను కాని ఈ విషయం శాస్త్రి గారికి చెప్పొద్దని చెప్పి వెళ్లబోతుంటే శాస్త్రి రావటం చూసి పక్కన దాక్కుంటుంది, నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టాను అంటూ తన గండపెరండాన్నిపెట్టుకుని కొత్త డబ్బు ఇవ్వమంటాడు శాస్త్రి, మీ గొప్ప సంగీతానికి గుర్తింపుగా ప్రజలు ఇచ్చిన ఆ బహుమతిని మీ దెగ్గర ఉంటేనే బాగుంటుంది అని శాస్త్రి కాలికే తొడగి డబ్బు ఇస్తాడు షావుకారు. శాస్త్రి పెళ్లి కార్డులు పంపుతాడు అందరికీ. తులసి అదే రోజు శాస్త్రి గారిచే తిరిగి ఒక సంగీత కచ్చేరి ఏర్పాటు జేయాలని భావించి, శాస్త్రి ఎన్నో కచ్చేరీలు ఇచ్చి మూతపడిన హాలునే కొనుక్కుని అందంగా తీర్చి దిద్ది శంకరాభరణం శంకర శాస్త్రి కళా మందిరం అని పేరు మారుస్తుంది. మాధవాచారి శాస్త్రిని కచ్చేరి కి ఒప్పించి పెళ్లికాగానే హాలుకి తీసుకువస్తాడు, కూతురు పెళ్ళైన ఆనందం ఒకపక్క మరోపక్క చాలా కాలం తరువాత తన గానానికి మళ్ళీ గుర్తింపు లభించిందని సంతోషపడి, ఆ కచ్చేరి పెట్టించిన మహానుభావులకు, కళా పోషకులకు క్రుతజ్ఞాతాభినందనలు తెలుపుకుని దొరకునా ఇటువంటి సేవ అని పాడుతుంటాడు, ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన తులసి శాస్త్రి గారి గానం మళ్ళీ పదిమందిలో విని ఉప్పొంగిపోతు శాస్త్రి గారు చేసిన కృతజ్ఞతా వందనాలకు చాటునుండే నమస్కారాలు పెడుతుంది. శాస్త్రి వయస్సు, ఆరోగ్యం గానానికి సహకరించక గుండెపోటు వస్తుంది, గానం మద్యలో ఆపకూడదని పాడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న శాస్త్రికి, నీ పాట పాడటానికి నేనున్నానన్నట్టూ శంకరం తరువాతి చరణాలు అందుకొని పాడతాడు, కామేశం డాక్టరును తీసుకు వస్తే ఇప్పుడు వైద్యం వద్దని సైగతోనే శంకరం సంగీత గానానికి అంతరాయం కలగవద్దని వేదిక పైకి రాకుండా ఆపేస్తాడు. శాస్త్రి గారికి ఏమో జరిగిందని బయట వచ్చిన తులసి శాస్త్రి కంటపడుతుంది, శంకరం తులసి కొడుకే అని గ్రహించిన శాస్త్రి ఎంతో సంతోష పడిపోతాడు, తన సంగీతం మరో తరానికి నిలబడనుందని తృప్తితో వేదికపైనే కన్నుమూస్తాడు, శాస్త్రి చేసిన ఉపకారానికి, తన వాళ్ళ శాస్త్రికి జరిగిన అపచారానికి ఋణం తీర్చుకున్నాని భావించిన తులసి వేదికపైనే శాస్త్రి కాళ్ళపై బడి అలాగే కన్నుమూస్తుంది. తండ్రి ఇంకలేడని నానా.. నాన్నా అంటూ రోదిస్తున్నశారదను అక్కున చేర్చుకుని ఓదారుస్తాడు కామేశం, తల్లికి ఏమో జరిగిందని అమ్మా.. అమ్మా.. అంటూ రోదిస్తున్న శంకరాన్ని దెగ్గర చేర్చుకుని ఊరడిస్తాడు మాధవా చారి. ఆ సంగీత మహానుభావునికి గౌరవసూచకంగా, ఆ మహా తల్లి మహా త్యాగానికి గుర్తింపుగా సభికులందరూ లేచి నిలబడి శ్రద్దాంజలి ఘటిస్తారు.
ఏకాకిగా మిగిలిపోయిన శంకరం, శంకర శాస్త్రి రాగాలు పాడుతూ ఆ సంగీతాన్ని ఇంకా నిలిపేందుకు ప్రయత్నం చేస్తుంటాడు....
(ఈ చివరి క్లైమాక్స్ ఘట్టం హృదయాల్ని పిండివేస్తుంది, సంగీతం పైన ప్రేమనూ, గౌరవాన్ని పెంపొందిస్తుంది. చాలా అద్భుతంగా తీరిచి దిద్దారు ఈ సన్నివేశాన్ని దర్శకులు విశ్వనాథ్ గారు... న భూతో...న భవిష్యతి అన్నాట్టుగా).
=======================================================================
పాట : 13 (దొరకునా ఇటువంటిసేవ)
గానం: యస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం
సంగీతం : కే.వి. మహదేవన్
రచన: వేటూరి సుందరరామ మూర్తి
రాగం: కల్యాణి
నటీ నటులు: జే.వి.సోమయాజులు, బేబీ తులసి, మంజు భార్గవి, అల్లు రామలింగయ్య, సాక్షి రంగా రావు, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి మొదలగువారు.
=======================================================================
దొరకునా ఇటువంటి సేవ
నాదాత్మకుడవై..........
నాలోన చెలగి
శాస్త్రి:
దొరకునా...దొరకునా... దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు, నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ
నీ పద రాజీవముల చేరు, నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు, నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు, నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవ
రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై..........
నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
ఆ.ఆ....ఆ...ఆ...ఆ..
ఆ.ఆ....ఆ...ఆ...ఆ..
ఆ.ఆ....ఆ...ఆ...ఆ..
ఆ ఆ ..అ ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
శంకరం:
అ..అ...ఆ..ఆ...ఆ...ఆ..
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నిను కొల్చువేళ దేవాది దేవా.. దేవాది దేవా....
ఆ..ఆ..అ....ఆ..ఆ..ఆ..ఆ...
ఆ ఆ ..అ ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
శంకరం:
అ..అ...ఆ..ఆ...ఆ...ఆ..
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నిను కొల్చువేళ దేవాది దేవా.. దేవాది దేవా....
ఆ..ఆ..అ....ఆ..ఆ..ఆ..ఆ...
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు, నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ
నీ పద రాజీవముల చేరు, నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవ
ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందు వేళ మహానుభావా ..........మహానుభావా....
దొరకునా....... ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా....... ఇటువంటి సేవ
0 comments:
Post a Comment