Tuesday, October 4, 2011

Sankarabharanam Songs -12




శంకరాభరణం చిత్రంలోని పాటలు 

Song : Paluke Bangaaramaayena 


శాస్త్రి గారు శారద, కామేశం ల పెళ్ళికి అంగీకారం తెలిపినట్టు విన్న శంకరం అటు బడిలో పాఠాలు చెబుతున్న కామేశానికీ, ఇటు ఇంట్లో బట్టలు ఉతుకుతున్న శారద కు సాయంత్రం అయిదు గంటలకి గట్టు కింద గుడికి వచ్చేయమనీ, అర్జెంటని చెబుతాడు. శారద, కామేశం లు ఎందుకో అని సరిగ్గా సమయానికే వస్తారు, అంతవరకూ గుడి ప్రక్కన  దాగున్న శంకరం పలుకే బంగారమాయెన అంటూ పాట పాడుతూ వారిద్దరి మద్యన వచ్చి శాస్త్రి గారు మీ ఇద్దరి పెళ్ళికీ ఒప్పుకున్నాడు అని శుభవార్త చెబుతాడు. ఇద్దరినీ తనను ఎత్తుకోమని చెప్పి దేవుని గంటను కొడతాడు. తాము కలగన్నది నిజం అవబోతుందని వారిద్దరూ కలిసి దేవుని గంట కొట్టి నమస్కారాలు తెలుపు కుంటారు.

=======================================================================
పాట : 12 (పలుకే బంగారమాయెన) 
గానం: వాణీజయరాం 
సంగీతం : కే.వి. మహదేవన్
రచన: రామదాసు (కీర్తన)
రాగం: ఆనంద భైరవి 
నటీ నటులు: బేబీ తులసి, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి 
=======================================================================

శంకరం:
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి 
కలలో నీ నామస్మరణా మరవా చక్కని స్వామి
పలుకే బంగారమాయెనా....












0 comments:

Post a Comment