Tuesday, October 4, 2011

Sankarabharanam Songs -11



శంకరాభరణం చిత్రంలోని పాటలు 

Song : Maanikyaveenaam

శాస్త్రి కోప్పడ్డం పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవటం భరించలేని శాస్త్రి స్నేహితుడు మాధవాచారి ధైర్యం చేసుకుని నీవు చేసిన పని ఏమిటి, ఆఖరుకు అమ్మాయిని ఏమి చేద్దామనుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు, కూతురు బంగారు భవిష్యత్తును తాను చేజేతులా చెడగొట్టి తప్పు చేసాను అని భావించిన శాస్త్రి ప్రాయశ్చిత్తంగా చేతిలోనే కర్పూరం వెలిగించి దేవునికి హారతిచ్చి క్షమించమని మనసులో వేడుకుంటాడు. తండ్రి మనసును అర్థం చేసుకున్న కూతురు కనుక వెన్న తెచ్చి రాస్తుంది, కూతురిని దెగ్గరకు తీసుకుని ఎలాగైనా పెళ్ళికి ప్రయత్నించాలి అని భావిస్తాడు శాస్త్రి. 

శాస్త్రి గారి దగ్గర అనవసరంగా నోరు జారి శారద ను కాకుండా చేసుకున్నానే అని బాధపడిన కామేశం ఎలాగైనా శాస్త్రిని మెప్పించాలని ప్లాన్ వేస్తాడు. శాస్త్రి రోజు ఊరి చివర మెత్త మీద ఉన్న అమ్మవారి గుడికి వస్తాడని తెలుసుకుని అక్కడే వచ్చేవరకు నిరీక్షించి తాను చూడనట్టు నటిస్తూ అమ్మవారి పైన సుమధురంగా గానం చేస్తాడు. అది విన్న శాస్త్రి ఎవరా అని చూసి కామేశమే తనకు అల్లుడు గా తగునని నిర్ణయించుకుంటాడు. 

=======================================================================
పాట : 11 (మాణిక్య వీణాం) 
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : కే.వి. మహదేవన్
రచన: మహా కవి కాళిదాసు (శ్యామలా దండకము)
రాగం: కల్యాణి 
నటీ నటులు: చంద్రమోహన్, జే.వి.సోమయాజులు
=======================================================================

కామేశం:
మాణిక్య వీణాం ముపలాలయంతీం,  మదాలసాం మంజుల వాగ్విలాసాం !
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం, మాతంగ కన్యాం మనసా స్మరామి !!

చతుర్భుజే చంద్రకళావతంసే, కుచోన్నతే కుంకుమ రాగషోణే !
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే, నమస్తే నమస్తే నమస్తే జగదేక మాతః !!   




0 comments:

Post a Comment