Tuesday, October 4, 2011

Sankarabharanam Songs -10


శంకరాభరణం చిత్రంలోని పాటలు 

Song : Saamaja Varagamana


శాస్త్రి గారి సంగీతమంటే గొప్పదిగా భావించే బామ్మ తన మనవడు కామేశ్వర రావు కు శారద ని చేసుకుందామని వస్తుంది. పెళ్లి చూపుల్లో పాట పాడమంటే తండ్రి అనుజ్ఞతో పాడుతుంది శారద, పెళ్లి కుదర బోతుందన్న సంతోషంలో ఊహల్లో విహరిస్తూ కామేశ్వర రావు తో కలలు కంటూ గానంలో శృతి తప్పుతుంది, అంతవరకూ కూతురు గానంలో తన్మయుడైన శాస్త్రి శృతి తప్పటంతో ఉగ్రుడై  "శారదా" అని అరచి అందరిముందే శుద్ధ హిందోళంలో రిషభం ఎలా వచ్చింది చెప్పు అంటూ ప్రశ్నించి ఆరోహణ, అవరోహణ లు చెప్పమంటాడు. శారద భయం భయంతో సమాధానాలు చెబుతుంది, ఇంతలో తనకు కాబోయే భార్యకు సపోర్ట్ చేద్దామని మద్యలో తల దూరుస్తాడు కామేశం, కొంత సంగీత జ్ఞానం ఉన్నా శాస్త్రి ముందు భయపడి పోయి అంతూ పొంతూ లేని సమాధానాలు చెప్తాడు, సంగీతం తెలియకపోతే నోరు మూసుకుండాలి గాని మద్యలో తల దూర్చతమెందుకు, రిషభం అని కూడా అని పలకటం చేత గాని సంగీత జ్ఞానం లేని వాడివి నా ముందర నుండి లేచి పొమ్మంటాడు శాస్త్రి. 

=======================================================================
పాట : 10 (సామజ వరగమనా) 
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి 
సంగీతం : కే.వి. మహదేవన్
రచన: మైసూర్ వాసుదేవాచారి (త్యాగరాజ సంప్రదాయ కీర్తన)
రాగం: హిందోళం 
నటీ నటులు: రాజ్యలక్ష్మి,చంద్రమోహన్, జే.వి.సోమయాజులు,బేబీ తులసి,నిర్మల,అల్లు రామలింగయ్య,పుష్పకుమారి  
=======================================================================






శారద: 
సామజ వరగమనా సాదుహృత్ సారసాబ్జ పాల
కాలాతీత విఖ్యాత సామజ వరగమనా 
సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల 
దయాలవాల మాంపాలయ

కామేశం: ఆమని కోయిల - 


శారద: ఉహుహూ 


కామేశం: 
ఇలా నా జీవన వేణువులూదగా 
ఆమని కోయిల  ఇలా నా జీవన వేణువులూదగా 
మధురలాలసల మధుపలాలనల - పెదవిలోని మధువులాను వ్రతము పూని జతకు చేరగా

శారద: 
నిసా - దనీ - మదా - గమా - సమమగ - గదదమ -మనినిద - సనిదమ - దనిసా - దనిసా 
గదదమ - మనినిద - దససని  - గపనిద  - నిసగ - నిసగ 
సమగమ - గససని - నిగసగ - సనినిద - దనినిద - మదదని - గమదని - సనిదమగస
సామజ వరగమనా సాదుహృత్ సారసాబ్జ పాల
కాలాతీత విఖ్యాత సామజ వరగమనా....ఆ..ఆ..ఆ........


కామేశం:
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా 
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా 
మదిని కోరికలు మదన గీతికలు
మదిని కోరికలు మదన గీతికలు
పరువమంత విరుల పాన్పు పరచి నిన్ను పలుకరించగా 


శారద: 
ఊ..ఊ..ఊ..ఊ...ఊ..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..
గమా - గమదమ గమా - గమనిద మదా - మదనిస దనీనినీని - మదనీ నినీని - గమదా దదాద  - మదనీ నినీద మగ - సాసా - సానీ - సాదా - సగమగ  - గమదని - గమదని 
మదనిస - మదనిస - దనిసగమా.... ఆ..ఆ...ఆ...

శాస్త్రి: శారదా................... 




0 comments:

Post a Comment